184 గంజాయి చాక్లెట్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

184 గంజాయి చాక్లెట్లు స్వాధీనం

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

తూప్రాన్‌: అక్రమంగా తరలిస్తున్న గంజాయి చాక్లెట్ల ను పోలీసులు పట్టుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గాయత్రి వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం 44వ జాతీయ రహదారిపై తూప్రాన్‌ టోల్‌ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి చాక్లెట్లను రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భారత్‌ వద్ద కొనుగోలు చేసి తీసుకొస్తున్న 184 గంజాయి చాక్లెట్లను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ప్రొహిబిషన్‌–ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీణారెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ అంజయ్య, కానిస్టేబుల్స్‌ రవికాంత్‌, విక్రమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement