సిద్దిపేట బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్
సిద్దిపేటఅర్బన్: ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రావణి అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇందూరు కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో 52 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స సమయంలో, గర్భిణులకు డెలివరీ సమయంలో, ఇతర అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని సూచించారు. యువత తమ పుట్టినరోజు ఇతర ముఖ్యమైన రోజులలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విపి రాజు, వైస్ ప్రిన్సిపాల్ బెనర్జీ,పీఆర్వో రఘు, సిబ్బంది పాల్గొన్నారు.


