పరామర్శకు వచ్చి.. గుండెపోటుకు గురై.. | - | Sakshi
Sakshi News home page

పరామర్శకు వచ్చి.. గుండెపోటుకు గురై..

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

సీపీఆర్‌ చేసినా దక్కని ప్రాణం

సీపీఆర్‌ చేసినా దక్కని ప్రాణం

శివ్వంపేట(నర్సాపూర్‌): పరామర్శకు వచ్చిన వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు మాచన ఈశ్వరయ్య మంగళవారం రాత్రి చనిపోయాడు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన గుండ నర్సింహులు(50) ఈశ్వరయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. వెంటనే స్థానికులు అతనికి సీపీఆర్‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. మరికొద్ది నిమిషాల్లోనే మరో మారు గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement