అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

చెరువులో మునిగి యువకుడి మృతి

చెరువులో మునిగి యువకుడి మృతి

చిన్నశంకరంపేట(మెదక్‌): అంత్యక్రియలు ముగిసిన అనంతరం చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శాలిపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ విఠల్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముండ్రాతి రమేశ్‌

(33) మంగళవారం గ్రామంలోని వరుసకు పెద్దమ్మ అయినా పోచమ్మ మృతి చెందగా అంత్యక్రియలకు వెళ్లాడు. అనంతరం స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లగా అందరూ చూస్తుండగానే నీటి మునిగి చనిపోయాడు. ఈత రాకపోవడంతో చెరువులో జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బుధవారం చెరువులో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement