పనిచేసే కార్యకర్తకే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పనిచేసే కార్యకర్తకే గుర్తింపు

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌ రాథోడ్‌

నారాయణఖేడ్‌: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌ రాథోడ్‌ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం కాంగ్రెస్‌ సంఘటన సృజన అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు కార్యకర్తలే వెన్నుముక అని అన్నారు. వారు నిరంతరం పార్టీ కోసం పనిచేస్తుండటం వల్లే పార్టీ బలంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం సేకరించిన అభిప్రాయాలను పార్టీ ఆధిష్టానానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నగేశ్‌ షెట్కార్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌, టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement