హుస్నాబాద్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్‌పై ఉన్న ఎన్జీటీ కేసును తొలగించి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం ఏన్జీటీ కేసును రద్దు చేయించలేకపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేసి ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపామన్నారు. కాంగ్రెస్ నాయకులే ప్రాజెక్టు పూర్తి కావడం తట్టుకోలేక కొందరిని ఉసిగొలిపి కేసులు వేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక ముందు పర్యావరణం, ఏన్జీటీ అనుమతులపై కోర్టుకు రావద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించాలని సూచించారు. కేసులు మీరే వేశారు, వాటిని పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపి ఆ క్రెడిట్‌ను మీరే తీసుకోవాలని పేర్కొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టును
నింపే బాధ్యత మంత్రి పొన్నందే..
మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్


