మెదక్ కలెక్టరేట్: పురస్కారాలు పొందిన అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంత్రి వివేక్, కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి పురస్కారాలు అందజేశారు. శనివారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, ఈడీఎం సందీప్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమభార్గవికి పురస్కారాలు అందజేశారు. అలాగే కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల శాఖ అధికారి గఫార్ మియా, రాజేశ్వరీ, నాయబ్ తహసీల్దార్, పోలీస్ శాఖలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందికి మొత్తం 40 మందికి పురస్కారాలు అందజేసినట్లు అధికారులు తెలిపా రు. రెవెన్యూ శాఖలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, శివ్వంపేట తహసీల్దార్ కమలాద్రి, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, జూనియర్ అసిస్టెంట్ భవాని, సందీప్‌లతోపాటు జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి మొత్తం 80 మందికి పురస్కారాలు అందజేశారు.
మరింత బాధ్యతతో పనిచేయాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
వివిధ శాఖల అధికారులు,
సిబ్బందికి ప్రదానం


