జీఓ 97 రద్దుకు ఒత్తిడి తేవాలి | - | Sakshi
Sakshi News home page

జీఓ 97 రద్దుకు ఒత్తిడి తేవాలి

Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM

సిద్దిపేటజోన్‌: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓ97ను ప్రభుత్వం రద్దు చేసేలా అసెంబ్లీలో ఒత్తిడి చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్‌ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మేకల అక్షయ్‌కుమార్‌ శనివారం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులతో కలిసి సమస్య వివరించారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ వ్యవస్థ ఏడు దశాబ్దాలుగా ఉందని, దాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యాచట్టం నుంచి తొలగించి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ చట్టం పరిధిలోకి చేర్చడం వల్ల నిరుపేద విద్యార్థులకు పాలిటెక్నిక్‌ చదువు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి అభిప్రాయాలను సేకరించకుండా ప్రభుత్వం జీఓ 97 తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన హరీశ్‌రావు అసెంబ్లీలో ఇదే అంశంపై మాట్లాడుతానని, పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేఏసీ ప్రతినిధులు సాయి, మంజునాథ్‌, సాయి గణేశ్‌, మహేశ్‌, ఆర్షద్‌, మనిదీప్‌, అశ్విత్‌ ఉన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావుకు

వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement