నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగల్‌గిద్ద మండలం గూడూరు శివారులో శనివారం చోటు చేసుకుంది. నాగలిగిద్ద ఏఎస్‌ఐ రవికుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆంజనేయులు సాగర్ (21) ఓ ఉపాధ్యాయురాలిని బైక్‌పై నాగల్‌గిద్ద గ్రామంలో దింపి అనంతరం తన గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు నుంచి నాగల్‌గిద్ద వైపు వస్తున్న ఆటో– బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న ఆంజనేయులు సాగర్‌కు తీవ్ర గాయాలు కాగా కుటుంబీకులు, స్థానికులు ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి మాణిక్ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలో ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని అంబులెనన్స్‌లో పటాన్‌న్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


