మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని వల్లంపట్ల గ్రామ సర్పంచ్ కర్నె సునీత భర్త మనోహర్‌పై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై ఆదివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మహ్మద్ ఆసీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముత్తిగారి యాదయ్య, హైదరాబాద్‌కు చెందిన బాబుగౌడ్ గ్రామంలో ఓ వెంచర్ చేసేందుకు ముందుకువచ్చారు. ఈ వెంచర్‌కు అనుమతినివ్వాలని యాదయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడుగుతుండగా సర్పంచ్ భర్త మధ్యలోకి వచ్చి తిడుతున్న క్రమంలో యాదయ్య తల్లి మరియమ్మ అక్కడికి చేరుకొని నా కొడుకును ఎందుకు తిడుతున్నావని సర్పంచ్ భర్తను ప్రశ్నించింది. సర్పంచ్ భర్త తనను కులం పేరుతో దూషించినట్లు మరియమ్మ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీపీ గ్రామాన్ని సందర్శించి సాక్షులను విచారించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


