అరటి రైతు ఆగం
పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలపాలు ఎకరా సాగుపై రూ.80 వేలకు పైగా పెట్టుబడులు క్వింటాలు ధర రూ. 300 మాత్రమే చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేసిన పంట
జహీరాబాద్: రైతులు కష్టపడి పండించిన అరటి పంట చేతికి అందివచ్చిన తరుణంలో గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలయ్యారు. జిల్లాలో సుమారు 800 ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 600 ఎకరాలకు పైగా సాగవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.300 నుంచి రూ.400లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ లేక..
మార్కెట్‌లో అరటి పండ్లకు డిమాండ్ లేనందున వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన ఉత్పత్తులు ఉంటేనే ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నార ంటున్నారు. చేతికి వచ్చిన పంటను కొనేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రాక పోవడంతో పలువురు రైతులు పొలాల్లోనే వదిలిపెట్టారు. రంజోల్, అల్లీపూర్, సజ్జాపూర్ గ్రామాల్లో పంట సాగు అధికంగా ఉంది. వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపక పోవడంతో కొందరు రైతులు మాత్రం భూమిలోనే దున్నేసినట్లు పేర్కొంటున్నారు.
సాగు విస్తీర్ణం పెరగడమే
అరటి పంట సాగు విస్తీర్ణం పెరడడం వల్లే మార్కెట్‌లో డిమాండ్ లేని పరిస్థితి ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంట సాగు అధికంగా ఉండడం వల్ల కూడ ధర పడిపోయేందుకు కారణమవుతోందని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో క్వింటాలు ధర రూ.1,600 పలికిందంటున్నారు. దీంతో రైతులు లాభదాయకంగా ఉంటుందని భావించి అరటి పంట సాగుకు మొగ్గుచూపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మార్కెట్లో డిమాండ్ కంటే ఉత్పత్తి అధికంగా ఉండడం వల్లే అరటి రైతులకు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్‌లో లభించని గిట్టుబాటు ధర


