ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రమాదవశాత్తు రెండు పూరిగుడిసెలు దగ్ధమైన సంఘటన చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామానికి చెందిన చింతకింది శంకర్, నర్సమ్మకు చెందిన గుడిసెలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు వరినాట్లు వెళ్లగా, ఇంట్లో తల్లి పడుకుని ఉంది. ఇంటి పక్కవారు గమనించి తల్లిని బయటకు తీసుకువచ్చారు. చుట్టుపక్కల వారు నిప్పును ఆర్పేందుకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు. రామాయంపేట ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే రెండు నివాస గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. శంకర్ ఇంట్లో రెండు లక్షల ఐదు వేల నగదు, 5 తులాల బంగారు అభరణాలు, 80 తులాల వెండి, నిత్యావసర సరుకులు, బట్టలు, డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. అలాగే నర్సమ్మ ఇంట్లోని లక్ష నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధమైనట్లు చెప్పారు.


