అంచనాలు తలకిందులు..
గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మంచి ధర ఉండడంతో దీన్ని పరిగణలోకి తీసుకుని అరటి పంటను వేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తీర ధర లభించక తమ అంచనాలు తలకిందులయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పంట సాగుకు సుమారు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు పెట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. రెండు నెలల క్రితం కిలో అరటి పండు ధర రూ.2 మాత్రమే ఉండిందని, ఇప్పుడు రూ.3కి పెరిగినట్లు చెబుతున్నారు. అయినా ఇది ఏ మాత్రం గిట్టుబాటు ధర కాదంటున్నారు. క్వింటాలు ధర కనీసం రూ.1,200 నుంచి 1,400 ధర పలికితేనే గిట్టుబాటుడుతుందంటున్నారు.


