రూ.లక్షల్లో నష్టపోయా
ఇరవై ఎకరాల్లో అరటి పెంట వేశాను. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాక పోవడంతో 30 శాతం చేతికి అందివచ్చిన పంట నేల పాలయింది. కొంత పంటను రూ.200 నుంచి రూ.300 క్వింటాలు ధరకు మాత్రమే కొన్నారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాను. అంతా కలిపి రూ.20లక్షల వరకు నష్టపోయాను. ప్రభుత్వం పరిహారం చెల్లించి అరటి రైతులను ఆదుకోవాలి.
–మంగరాజు, రైతు, రంజోల్
పెట్టుబడులు రాలేదు
అరటి పంటకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో సాగుపై ఆసక్తి చూపాను. 17 ఎకరాల్లో అరటి పంట వేసుకున్నాను. తీరా పంట చేతికి అందివచ్చాక కొనుగోలు చేసేవారే లేకుండా పోయారు. సగం పంట పొలాల్లోనే పోయింది. సుమారు 50 టన్నుల వరకు పొలంలోనే వదిలివేయాల్సి వచ్చింది. కోసిన పంట కూడ రూ.300లకు క్వింటాలు వంతున మాత్రమే కొన్నారు. ఎకరా పంట సాగుపై రూ.80వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పెట్టుబడులు సైతం రాలేదు.
–మద్ద రాంరెడ్డి, రైతు, రంజోల్


