ఏటీఎంలో చోరీకి యత్నం
పటాన్‌చెరు టౌన్: స్థానిక డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌కాలనీ సమీపంలో ఓ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించి పరారయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్‌నగర్ కాలనీ సమీపంలో పారిశ్రామిక వాడకు ఆనుకుని రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోరీకి యత్నించారు. నగదు దొంగలించేందుకు ఏటీఎం మిషన్ కింది భాగం తీసి కేబుల్స్ తగలబెట్టారు. ఈ సమయంలో పటాన్‌చెరు పోలీస్ బ్లూ కోట్ సిబ్బంది రావడం చూసి దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం కేసులో
నిందితుడి అరెస్టు
కొల్చారం(నర్సాపూర్): మండల పరిధి దుంపలకుంట చౌరస్తాలో దుకాణాల షట్టర్లను పగలగొట్టిన నిందితుడిని పోలీసులు పట్టుకొని, రిమాండ్‌కు తరలించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 28 రాత్రి దుంపలకుంట చౌరస్తాలోని నాలుగు దుకాణాల షట్టర్లను పగలగొట్టి నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో దొంగతనానికి పాల్పడింది.. పాత నేరస్తుడుగా గుర్తించారు. దుంపలకుంట చౌరస్తాలో నివాసం ఉంటున్న సంపంగి శివకుమార్ అలియాస్ వడ్డే కుమార్‌ను మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్ ల్లో నిందితుడిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడు నుంచి రూ. 18,500 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపారు.
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
రూ. 5 లక్షల విలువైన
బంగారు ఆభరణాల అపహరణ
సంగారెడ్డి క్రైమ్: పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మధురానగర్‌కు చెందిన కీర్తికుమార్ పట్టణంలో వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 29న సోమవారం సాయంత్రం పని నిమిత్తం పట్టణంలోని శిల్పవేచర్‌కు వెళ్లిన ఆయన తిరిగి మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపుల తాళాలు పగలకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని ఏడు తులాల బంగారం, డబ్బును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లారు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బంగారం ధర సూమరు రూ.5లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గణితంలో విద్యార్థి ప్రతిభ
శివ్వంపేట(నర్సాపూర్): తెలంగాణ మేథమాటిక్స్ ఆధ్వర్యంలో మంగళవారం మెదక్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని గూడూర్ కస్తూర్బాగాంధీ విద్యార్థిని సక్కుబా యి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినికి కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి బహుమతి ప్రధానం చేసినట్లు గణిత ఉపాధ్యాయురాలు రాధిక తెలిపారు. అనంతరం ఎంఈఓ బుచ్చ నాయక్, కేజీవీబీ ప్రత్యేక అధికారి మంజుల, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.
ఏటీఎంలో చోరీకి యత్నం


