వేడుకలకు పటిష్ట బందోబస్తు
● నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● రాత్రంతా విస్తృతంగా వాహనాల తనిఖీ ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్
సంగారెడ్డి క్రైమ్: నూతన సంవత్సర వేడుకల్లో పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 100మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్‌తో పాటు, ప్రధాన రహదారుల్లో , మహబూబ్ సాగర్ చెరువు కట్ట, తదితర ప్రాంతాల్లో బందోబస్తు, పెట్రోలింగ్ వాహనాలు , డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలు కుటుంబ సభ్యులు , స్నేహితులతోనే కలిసి ఇంట్లో, అపార్ట్‌మెంట్‌లో జరుపుకోవాలని సూచించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పాటించాల్సిన నిబంధనలు


