తడోబా టైగర్ ప్రాజెక్టు నిపుణుల టీం పరిశీలన..
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుకు చెందిన డాక్టర్ రవికాంత్‌తో కూడిన ముగ్గురు బయోలాజిస్ట్ నిపుణుల టీం మంగళవారం జిల్లాలోని తొగుట మండలం వర్ధరాజుపల్లి, బుస్సాపూర్ అడవిప్రాంతాలతో పాటు పులిసంచరించిన ప్రాంతాలను సందర్శించి పాదముద్రలను పరిశీలించారు. పులి ఇక్కడే ఉందా? మరో ప్రాంతానికి వెళ్లిందా? అన్న దానిపై పలు కోణాల్లో పరిశీలించింది. తడోబా టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు నిపుణులతో పాటు సీసీఎఫ్ రామలింగ, సిద్దిపేట డీఎఫ్‌ఓ పద్మజరాణి,కామారెడ్డి డీఎఫ్‌ఓతో పాటు పలువురు ఫారెస్టు ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. పెద్దపులి తిరిగిన ప్రాంతాల్లో పర్యటించి టైగర్‌ను ఎలా క్లోజ్‌గా మానిటర్ చేయాలో అధికారులకు సూచించారు. ప్రాంతాల్లో ప్రత్యేకంగా 15 ట్రేస్ కెమరాలతో పాటు డ్రోన్ కెమరాలతో సైతం నిఘాను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 45 మంది సిబ్బందితో పెట్రోలింగ్ టీంలు పులిజాడ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


