
శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జోన్: పోటీ పరీక్షల కొరకు నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 తో పాటు ఆర్.ఆర్.బి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల కొరకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యం గల శిక్షకులతో నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సర్వే ఏడీ ఐనేష్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
ప్రజావాణికి 44 అర్జీలు
కాగా, కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 44 అర్జీలు సమర్పించారు. అధికంగా రెవెన్యూ సమస్యలే వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఆర్‌ఓ పద్మజరాణి, తదితరులు పాల్గొన్నారు.