
యూరియా కోసం రైతుల ధర్నా
తెల్లవారక ముందే యూరియా కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్‌లో నిలుచున్నా యూరియా దొరకట్లేదని వాపోతున్నారు. మూడు, నాలుగు రోజులుగా ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన రైతులు సోమవారం మండల కేంద్రంలో యూరియా కోసం ధర్నా చేశారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ మానస, ఏవో నరేశ్ ధర్నా వద్దకు చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా తెప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
– దుబ్బాకటౌన్: