
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
గజ్వేల్‌రూరల్: విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా యూఎస్‌ఎఫ్‌ఐ పోరాడుతోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవి, తిరుపతిలు అన్నారు. పట్టణంలోని కోలా అభిరాం గార్డెన్స్‌లో ఆదివారం రెండవ రోజు యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రథమ మహాసభలు కొనసాగాయి. ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలకు సొంత భవనాలను నిర్మించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈవో, ఉపాధ్యాయ, లెక్చరర్, వర్కర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలన్నారు. అనంతనం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా శేఖర్, రవిని ఎన్నుకున్నారు.