
చెరకు సాగు విస్తరణకు సహకారం
న్యాల్‌కల్(జహీరాబాద్): చెరకు పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని గోదావరి–గంగా ఆగ్రో చెక్కర కర్మాగారం ఎండీ సచిన్ గోయాల్ అన్నారు. న్యాల్‌కల్ మండల పరిధిలోని ముంగి, హద్నూర్, రుక్మాపూర్‌లలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో చెరకు పంటను పరిశీలించి అనంతరం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. అక్టోబర్‌లో ఫ్యాక్టరీలో చెరకు క్రస్సింగ్ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది 3లక్షల టన్నుల క్రస్సింగ్ చేసేందుకు నిర్ణయించామన్నారు. రోజుకు దాదాపు 2,700 టన్నుల చెరకు క్రస్సింగ్ చేయనున్నామని తెలిపారు. గతేడాది టన్నుకు రూ.3,700 చెల్లించగా.. కోత, రవాణా ఖర్చులు పోను రైతుకు రూ.2,800 మిగిలిందన్నారు. రైతులను ప్రోత్సాహం అందించి పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు సుమారు 85లక్షల చెరకు మొక్కలు అందజేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది 15లక్షల మొక్కలను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేన్ డెవలప్‌మెంట్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ సురేందర్ పాటిల్, రైతులు నర్సింహారెడ్డి, విఠల్‌రెడ్డి, అశోక్, తుల్జారాం తదితరులు పాల్గొన్నారు.
గోదావరి–గంగా ఆగ్రో చెక్కర
కర్మాగారం ఎండీ సచిన్ గోయాల్
ముంగి, హద్నూర్, రుక్మాపూర్‌లలో
చెరకు పంటల పరిశీలన