
‘భావ తరంగాలు’తో ప్రేరణ
సంగారెడ్డి టౌన్: మండల పరిధిలోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో పాకా రాజమౌళి రచించిన ‘భావతరంగాలు భారతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి రచించిన భావ తరంగాలు ఎంతో మందికి ప్రేరణాదాయకంగా ఉందన్నారు. అనంతరం ఆయన రచనా స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి, వడ్డీ విజయ సారథి, పూర్ణ కృష్ణ, చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.