
గణేష్ లడ్డూ అదరహో
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అంకురలో గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఆదివారం వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక లడ్డూను వేలం వేయగా.. కాలనీకు చెందిన అభిషేక్ రెడ్డి, మల్లేపల్లి రాజేందర్ రెడ్డిలు రూ.6,66,666లకు కై వసం చేసుకున్నారు. అనంతరం వారిని వినాయక కమిటీ సభ్యులు సన్మానించారు. అలాగే మై ఫెయిర్ విల్లాస్‌లో నాగేంద్ర కిషోర్ రూ.3.8లక్షలు, మేగ్నా మేడోస్ విల్లాస్‌లో వినోద్ రూ.2.7లక్షలు, బ్లూమ్ ఫీల్డ్ విల్లాస్‌లో దుర్గా ప్రసాద్ రూ.75వేలకు లడ్డూలను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంకుర సోసైటీ సభ్యులు రాధిక, నగేష్, కార్తీక్, శ్రీధర్, గణేష్, శ్రీశైలం, మల్లారెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేష్, ఉమా పాల్గొన్నారు.