సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కల్హేర్(నారాయణఖేడ్): ఎన్నికలు వస్తేనే రైతు భరోసా, ప్రభుత్వ పథకాలు అరకొరగా అమలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం సిర్గాపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలి సి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అధికారం కోసం హామీలు ఇచ్చి రైతులు, ప్రజలను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లడుతూ.. నల్లవాగు కాల్వల్లో పూడిక తీయడంలో జాప్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, జంగం శ్రీనివాస్,సంజీవరావు, నజీబ్, ముజమ్మిల్, మాధవరావు పటేల్, బాదల్‌గాం నగేష్, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.