
అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య
జగదేవ్‌పూర్(గజ్వేల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... జగదేవ్‌పూర్‌కు చెందిన ఎర్ర రామవ్వ(60)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లున్నారు. రామవ్వ భర్త మైసయ్య నాలుగేళ్ల క్రితం మృతి చెందగా అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తుంది. కొంతకాలంగా కడుపునొప్పి, ఫిట్స్‌తో బాధపడుతున్న రామవ్వ సోమవారం సాయంత్రం తన గదిలో దూలానికి ఉరివేసుకుంది. మంగళవారం ఉదయం ఆమె కొడుకు సత్యనారాయణ గది తలుపులను పగులగొట్టి చూడగా ఉరివేసుకొని చనిపోయి కనిపించింది.
పురుగుల మందు తాగి వృద్ధుడు..
జగదేవ్‌పూర్(గజ్వేల్): వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాడబోయిన మల్లయ్య(80)కు వివాహం కాకపోవడంతో అతని బాగోగులను తమ్ముడి కొడుకులు చూసుకుంటున్నారు. మండల కేంద్రంలో తిరుగుతూ సాయంత్రానికి ఇంటికి చేరుకునే మల్లయ్య సోమవారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మంగళవారం ఉదయం జగదేవ్‌పూర్ మార్కెట్‌లో పురుగుల మందు తాగి వ్యక్తి చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణ చేపట్టిన పోలీసులు మల్లయ్య మృతదేహంగా గుర్తించి గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.