
ఉగ్రదాడులను ఉపేక్షించం
సదాశివపేట(సంగారెడ్డి): ఉగ్రదాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించేదిలేదని, హిందువుల సహనాన్ని పరీక్షించొద్దని హిందూ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సదాశివపేటలో హిందూ జేఏసీ ప్రతినిధులు శనివారం భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేవాలయాల కమిటీ సభ్యులు యువకులు భారీ ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ పట్టణంలోని ప్రభుమందిరం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ...ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఆశ్రయమిస్తున్న బంగ్లాదేశ్‌లు హద్దులు దాటాయని ఇక ఇలాంటి ఘటనలకు ప్రతి చర్యలు తప్పవన్నారు. హిందువులంతా ప్రపంచ శాంతిని కోరేవారని తెలిపారు.
సదాశివపేటలో హిందూ జేఏసీ
శాంతి ర్యాలీ