............. | - | Sakshi
Sakshi News home page

..........

Nov 28 2024 7:54 AM | Updated on Nov 28 2024 11:00 AM

సంగారెడ్డి జోన్‌: ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారులకు సంబంధించిన కరదీపికను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి బుధవారం విడుదల చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన కుటుంబ సంక్షేమం, జాతీయ ఆరోగ్య మిషన్‌, జనని సురక్ష యోజన, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సేవలు, ఆహారం, ఆరోగ్యం, ఎయిడ్స్‌ వ్యాధి నిరోధక కార్యక్రమాలు, ప్రథమ చికిత్స, యోగ వంటి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి.గాయత్రిదేవి, డాక్టర్‌ శశాంక్‌, ఎం.ప్రసాద్‌, రవి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement