దుష్ప్రచారాలపై అఘోరీ ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారాలపై అఘోరీ ఫిర్యాదు

Oct 23 2024 7:34 AM | Updated on Oct 23 2024 9:33 AM

-

సిద్దిపేటఅర్బన్‌: తనను అరెస్టు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్న చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన మహిళా అఘోరీ శివవిష్ణు బ్రహ్మ సిద్దిపేట త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అనంతరం అఘోరీ మాట్లాడుతూ.. తన గురువును కలిసేందుకు హైదరాబాద్‌ నుంచి బద్రీనాథ్‌ వెళ్తుండగా దుద్దెడ టోల్‌గేట్‌ సమీపంలోకి వచ్చేసరికి తనపై చానెళ్లలో దుష్ప్రచారం జరుగుతోందని తెలిసిందని, వెంటనే సమీపంలోని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

తాను నిజమైన అఘోరీ కాదని, ఫేమస్‌ అయ్యేందుకు అఘోరీలా వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తోందని పలు యూట్యూబ్‌ చానెళ్లు, న్యూస్‌ చానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నా యని ఆరోపించారు. వ ాటిని అరికట్టి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ విషయంపై సిద్దిపేట త్రీటౌన్‌ సీఐ విద్యాసాగర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement