పండుగకు పుట్టింటికి పంపలేదని.. | - | Sakshi
Sakshi News home page

పండుగకు పుట్టింటికి పంపలేదని..

Oct 17 2024 7:14 AM | Updated on Oct 17 2024 7:52 AM

-

చేర్యాల(సిద్దిపేట): దసరా పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పీ.నీరేశ్‌ కథనం మేరకు.. ఆకునూరు గ్రామానికి చెందిన పెంటపర్తి శ్రావణ్‌రెడ్డికి హన్మకొండ జిల్లా, ధర్మసాగర్‌ మండలం, క్యాతంపల్లికి చెందిన సౌమ్య (24)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. కొద్ది రోజులుగా సౌమ్య తల్లిదండ్రులు గొడవపడి వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే గొడవ విషయాన్ని సౌమ్య తండ్రి రాంరెడ్డి అల్లుడై శ్రావణ్‌కి ఫోన్‌ చేసి చెప్పాడు. 

ఆత్తమ్మ, నేను వేర్వేరుగా ఉంటున్నామని పండుగకు పంపొద్దన్నాడు. దీంతో సౌమ్యని పండుగకు పంపలేదు. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలికి 14 నెలల పాప ఉంది. తల్లి మంజుల ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement