సాక్షి హైదరాబాద్:1985లో స్థాపించబడిన నారాయణ స్కూల్స్ (నారాయణ ఇ-టెక్నో స్కూల్స్ అని కూడా పిలుస్తారు)తెలంగాణలో విస్తరించే క్రమంలో మరో ఐదు కొత్త స్కూల్ క్యాంపస్లను ప్రారంభించింది. వీటిలో నాలుగు హైదరాబాద్‌లో, ఒకటి నిజామాబాద్‌లో ప్రారంభించింది.
నారాయణ స్కూల్ ప్రతినిధులు అందించిన వివరాల ప్రకారం, నిజామాబాద్ క్యాంపస్‌లో హాస్టల్ సౌకర్యాలతో పాటు, సీబీఎస్ఈ (CBSE) కరిక్యులమ్‌ను అందిస్తుండగా, హైదరాబాద్ క్యాంపస్ లో స్టేట్ బోర్డ్ కరిక్యులమ్‌ను అందిస్తున్నాయి. ఈ కొత్త క్యాంపస్లు డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలతో కూడిన విద్యా కార్యక్రమాలు, వయస్సుకు తగిన బోధనా పద్ధతులను అందిస్తూ, విద్యార్థుల సంపూర్ణ వికాసంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ విస్తరణతో, తెలంగాణలోని 120 క్యాంపస్లతో సహా భారతదేశవ్యాప్తంగా నారాయణ పాఠశాలల నెట్‌వర్క్ 574 క్యాంపస్లకు పెరిగింది.


