హైదరాబాద్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. స్లాట్ తీసుకున్న వారి భూములను 2 రోజుల్లో పరిశీలిస్తామన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీ) 22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 22-ఏ జాబితాలో ఉన్నది ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు, ఈ మేరకు కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
‘జిల్లాల వారీగా 22-ఏ భూములపై సమగ్ర పరిశీలన చేయాలి. తప్పుల్లేని తుది జాబితా రూపొందించాలి. శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. ప్రైవేటు భూముల్లో ఒక్క అంగుళానికీ ఇబ్బంది రానివ్వం. భూ హక్కులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22-ఏ సమస్యల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించొద్దు. పుకార్లు, కట్టుకథలను నమ్మకండి. ఆస్తుల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని స్సష్టం చేశారు.
..
..


