
కరపత్రం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేటజోన్: కేధారినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో యాత్రికులకు అన్నదానం చేస్తున్న నేపథ్యంలో బుధవారం సమితి రూపొందించిన కరపత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రత్నాకర్, శ్రీనివాస్, నవీన్ ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి వెళ్లి అయోధ్య, అమర్నాథ్, కేధారినాథ్ లాంటి ప్రాంతాల్లో అన్నదానం చేయడం గొప్ప విషయమని అభినందించారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవలో సమితి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మే 3న సిద్దిపేట నుంచి లారీల్లో అన్నదాన సామగ్రి వెళ్లనుందని సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. అంతకుముందు వివిధ గ్రామాల, కుల సంఘాల ప్రతినిధులు గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని హరీశ్ రావును కలిసి కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మున్సిప ల్ మాజీ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.