యాప్‌లో కుష్ఠు బాధితుల వివరాలు | Sakshi
Sakshi News home page

యాప్‌లో కుష్ఠు బాధితుల వివరాలు

Published Wed, Apr 17 2024 8:20 AM

యాప్‌పై అవగాహన కల్పిస్తున్న శ్రీదేవి  - Sakshi

ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీదేవి

సిద్దిపేటకమాన్‌: జిల్లా వ్యాప్తంగా కుష్ఠు బాధితులను గుర్తించి వెంటనే ఓరియంటేషన్‌, నిక్యూస్ట్‌ యాప్‌లో వారి వివరాలను నమోదు చేయాలని ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీదేవి అన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నోడల్‌ పర్సన్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యాప్‌పై కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాధితులను గుర్తించిన వెంటనే యాప్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. తద్వారా వ్యాధి నిర్మూలన చేపట్టేందుకు యాప్‌ ఎంతగానో దోహదం పడుతుందన్నారు. వివరాల మేరకు మందుల సరఫరా, నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శిక్షకులు రాష్ట్ర లెప్రసీ సొసైటీ సభ్యులు, కామేశ్వరరావు, నరసింహ స్వామి, డీపీఎంఓలు, ఎన్‌ఎల్‌ఈపీ, సిబ్బంది పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement