సంక్రాంతి తర్వాతే అందుబాటులోకి..
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: సంక్రాంతి పండుగ అనంతరం పటాన్‌చెరుకేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్న పాత తహసీల్దార్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మితో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. శాశ్వత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా ఈ భవనంలోనే కార్యాలయం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు.
కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్
పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పాత అమీన్‌పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల అఖిలపక్ష బృంద సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకుని వెళ్లి నూతన డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ ఎంపీపీ దేవానందం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


