సంగారెడ్డి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శ్యాంసుందర్‌కు సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ వెల్లడించారు. సంగారెడ్డిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో మీర్‌దొడ్డి శ్యాంసుందర్‌కు జిల్లా నుంచి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బెజిగం శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోపాజీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


