వర్క్‌షాప్‌కు హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు | - | Sakshi
Sakshi News home page

వర్క్‌షాప్‌కు హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

Mar 11 2026 8:39 AM | Updated on Mar 11 2026 8:39 AM

జహీరాబాద్‌: గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో మంగళవారం ప్రారంభమైన ఎమ్మెల్యేల వర్క్‌షాప్‌కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు జిల్లాలోని జహీరాబాద్‌, సంగారెడ్డి, ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంతోపాటు సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు, రాజ్యాంగం అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు.

20న చలో కలెక్టరేట్‌

సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి

సంగారెడ్డి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం రైతు, కూలీల హక్కులను తొలగించే పద్ధతులను మానుకోవాలని సీపీఎం సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ కూలీల హక్కుల పరిరక్షణకు ఈ నెల 20న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని విజయంవతం చేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలంలోని పసల్వాదిలో ఉపాధి హామీ కూలీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో యాదగిరి పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో అధికారాంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజలపై, కార్మిక, రైతు కూలీలపై ఆర్థిక భారాన్ని మోపుతూ అంబానీ, అదానీలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రూ.3 లక్షల కోట్లు బడ్జెట్‌ పెట్టడానికి ఎందుకు వెనకాడిందని ప్రశ్నించారు.

రాష్ట్రస్థాయి

సెమినార్‌కు ఎంపిక

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జిక్రా మహి న్‌ రాష్ట్రస్థాయి సెమినార్‌ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సంగారెడ్డిలో ఐక్య రాజ్యసమితి అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో 43 పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అందులో న్యాల్‌కల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థి జిక్రా మహిన్‌ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది.

‘పట్టు సాగుకు ప్రోత్సాహం’

జహీరాబాద్‌ టౌన్‌: పట్టు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన, పట్టు శాఖ జిల్లా అధికారి సోమేశ్వర్‌రావు తెలిపారు. కోహీర్‌ మండలంలోని గురుజువాడ గ్రామ పరిధిలో రైతు నిర్మిస్తున్న షెడ్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...మల్బరీ తోటల పెంపకం, షెడ్ల నిర్మాణానికి పరికరాల కొనుగోలుకు సిల్క్‌ సమగ్ర పథకం కింద సబ్సిడీ వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 నుంచి 90%, సాధారణ రైతులకు 50% సబ్సిడీ వస్తుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌చార్జి డీపీఓ జానకిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెహమాన్‌ మాట్లాడుతూ...గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. కొన్ని గ్రామా ల్లో నూతన సర్పంచులు మల్టీపర్పస్‌ వర్కర్స్‌ను వేధింపులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. పైస్థాయి అధికారులు వీటిపై పర్యవేక్షించాలని, మల్టీ పర్పస్‌ వర్కర్స్‌ అందరికీ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement