నివేదికల్లో జాప్యం తగదు | - | Sakshi
Sakshi News home page

నివేదికల్లో జాప్యం తగదు

Nov 22 2023 4:26 AM | Updated on Nov 22 2023 4:26 AM

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌ తదితరులు - Sakshi

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌ తదితరులు

కలెక్టర్‌కు సీఈసీ వికాస్‌రాజ్‌ సూచన

సంగారెడ్డి టౌన్‌: ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌ రాజ్‌ సూచించారు. శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో కలిసి ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించిన నివేదికలను అందజేయడంలో జాప్యం చేయొద్దన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్ల గురించి ఎన్నికల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ కోసం చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. రోజూ నోడల్‌ అధికారి ద్వారా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై రివ్యూ నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రచార సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి సువిధ పోర్టల్‌ ద్వారా వచ్చే దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే స్పందిస్తూ, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, మాధురి, రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement