అల్లరి చేసిన యువకులకు కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అల్లరి చేసిన యువకులకు కౌన్సెలింగ్‌

Mar 29 2023 4:00 AM | Updated on Mar 29 2023 4:00 AM

నర్సాపూర్‌: ఓ ప్రైవేటు కాలేజీ బస్సును ఫాలో చేస్తూ విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్న యువ కులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌ ఎగ్జామ్స్‌ మంగళవారం ముగియడంతో సంగారెడ్డి నుంచి ఓ ప్రైవేట్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు బస్సులో నర్సాపూర్‌కు వస్తున్నారు. ఈ సమయంలో శివ్వంపేటతండాకు చెందిన ఇద్దరు యువకులు, తునికికి చెందిన మరో యువకుడు బైక్‌పై బస్సును వెంబడించారు. విద్యార్థినులను చూస్తూ అల్లరిగా కేకలు వేశారు. ఇబ్బంది పడిన ఆ విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. నర్సాపూర్‌ మార్గంలోని ఓ కిరాణ దుకాణం వద్దకు కాలేజీ బస్సును నిలపగా, తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. బస్సు వెనకే వస్తున్న ముగ్గురు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్‌ఐ శివకుమార్‌ను వివరణ కోరగా, బస్సు సిబ్బంది ఫిర్యాదు చేశారని, యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపాలని కోరారన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆ యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని ఎస్‌ఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement