కేఎల్లార్‌ వర్సెస్‌ పారిజాత | - | Sakshi
Sakshi News home page

కేఎల్లార్‌ వర్సెస్‌ పారిజాత

Nov 18 2026 11:07 AM | Updated on Nov 18 2026 11:07 AM

దేవాలయ కమిటీలకు

పోటాపోటీ

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్‌ వర్సెన్‌ డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నర్సింహారెడ్డి మధ్య ఇప్పటికే నెలకొన్న అంత ర్గత విబేధాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) నూతన పాలక మండళ్ల ఎంపికలో మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ శ్రేణులు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌ బాబు సహా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులకు ఫిర్యాదు చేశాయి. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వద్దకు పంచాయతీ చేరింది. ఇరు వర్గాల మధ్య నెలకొన్న విబేధాలు ముదిరి పాకాన పడు తుండటంతో పాలక మండళ్ల ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పదవీకాలం ముగియడంతో..

ఉమ్మడి జిల్లాలో వికారాబాద్‌లో 22 పీఏసీఎస్‌లు, మేడ్చల్‌–మల్కాజి గిరి జిల్లాలో 5, రంగారెడ్డిలో 37 కలిపి మొత్తం 64 ఉన్నాయి. వీటికి 2020లో ఎన్నికలు నిర్వహించి పాలకమండళ్లను ఎన్నుకున్నారు. ఆయా పాలక మండళ్ల గడువు 2025 ఫిబ్రవరి 25తో ముగిసింది. 2023 నవంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవడం, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం జరిగింది. పాలక మండళ్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోగా పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎన్నికై న పాలకమండళ్లు రైతుల సంక్షేమం కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పాటు పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆయా పాలకమండళ్లను రద్దు చేసింది. వీటి స్థానంలో నామినేటెడ్‌ ప్రాతిపదికన కొత్త పాలకమండళ్ల (ఒక్కొ సొసైటీకి చైర్మన్‌ సహా 12 మంది డైరెక్టర్లు)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కేఎల్‌ఆర్‌ ఏకపక్ష నిర్ణయంపై డీసీసీ గుర్రు

ఈ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, బాలాపూర్‌, మహేశ్వరం, నాదర్‌గుల్‌ సొసైటీల పాలకమండళ్లను నియమించాలని నిర్ణయించారు. నిజానికి ఏదైనా నామినేటెడ్‌ పదవిని కట్టబెట్టాలంటే పార్టీలో సదరు అభ్యర్థి కనీసం మూడేళ్ల సభ్యత్వం కలిగి ఉండాలనే నిబంధన ఉంది. కానీ కేఎల్‌ఆర్‌ దీనికి విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. కష్టకాలంలో పార్టీనే అంటి పెట్టుకుని పని చేసిన సీనియర్‌ కార్యకర్తలను కాదని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను వీడి ఇటీవలే హస్తం గూటికి చేరుకున్న జంప్‌ జిలానీల పేర్లను సిఫార్సు చేసినట్లు తెలియడంతో ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోయారు. కేఎల్లార్‌ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమన్నారు. ఆయన సిఫార్సు చేసిన పేర్లను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు సహా సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఫిర్యాదు చేశారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం.

మహేశ్వరం కాంగ్రెస్‌లో తారస్థాయికి చేరిన వర్గ విబేధాలు

వివాదాస్పదంగా మారిన పీఏసీఎస్‌ నూతన కమిటీల ఎంపిక

మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల సహా పీసీసీ చీఫ్‌లకు ఫిర్యాదు

నిలిచిన సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ

పీఏసీఎస్‌లతో పాటు ప్రముఖ దేవాలయాలకు పాలకమండళ్లను కూడా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వా నించింది. ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పాలకమండళ్ల ఎంపికలో రాజకీయ జోక్యం పెరగడం వివాదాస్పదంగా మారింది. దాతలు, భక్తులకు బదులు రాజకీయ నేపథ్యం కలిగిన వారిని డైరెక్టర్లుగా, చైర్మన్లుగా నియమిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెజార్టీ దేవాలయా ల్లోని పాలక మండలి సభ్యులు సాధారణ భక్తులను విస్మరించి, వీఐపీల సేవల్లో నిమగ్నమవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. దేవుడికి దాతలు, భక్తులు సమర్పించిన విలువైన కానుకలు, నగదు స్వాహా చేస్తున్న ట్లు ఫిర్యాదులు లేకపోలేదు. దేవుడిపేరున ఉన్న విలువైన ఆస్తులను కూడా పాలకమండళ్లే ఆరగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement