భూదాన భూమిలో నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

భూదాన భూమిలో నిర్మాణాల కూల్చివేత

Nov 18 2026 11:07 AM | Updated on Nov 18 2026 11:07 AM

భూదాన భూమిలో నిర్మాణాల కూల్చివేత అబ్దుల్లాపూర్‌మెట్‌: మండల పరిధిలోని బాటసింగారం సర్వేనంబర్‌ 319లో ఉన్న భూదాన భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను మంగళవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ వేణు ఆదేశాల మేరకు ఆర్‌ఐ మహేశ్‌కుమార్‌, జీపీఓ కవిత జేసీబీల సాయంతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మహేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. భూదాన భూముల్లో ప్లాట్లు విక్రయిస్తే ఎవరూ కొనొద్దని సూచించారు. భూదాన భూములు అమ్మడం, కొనడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. భూదాన, ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్వర పరిష్కారమే ప్రజాబాట లక్ష్యం మీర్‌పేట: ప్రజాబాట ద్వారా విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నామని టీజీఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ చక్రపాణి అన్నారు. మీర్‌పేట సెక్షన్‌ పరిధిలోని శివగంగ హిల్స్‌కాలనీలో మంగళవారం విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల వద్దకు వెళ్లి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనిఫాం సర్వీస్‌ లైన్‌ ఛార్జీలు, సోలార్‌ నెట్‌ మీటర్ల ఏర్పాటు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గోసంరక్షణకు పూర్తి సహకారం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో విజిలెన్స్‌ తనిఖీలు

మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్‌: గోవుల సంరక్షణ, గోశాలల పరిరక్షణ కోరుతూ యుగ తులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘గో సడక్‌ బంద్‌’ ప్రశాంతంగా ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రైతులు, గోసంరక్షకులు, గో ప్రేమికులు పోలీసులకు తమ విజ్ఞప్తులను తెలిపారు. మండలంలోని జాఫర్‌గూడలో యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలను మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోవుల అక్రమ రవాణాపై పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జిల్లా వెటర్నరీ అధికారి అంకం రాజు, వైద్యుల బృందం గోశాలను సందర్శించి మూగజీవాల వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితులను సమీక్షించారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్‌ చైర్మన్‌ కె.శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గోశాలల సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పూర్తి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ హామీ ఇచ్చారని శివకుమార్‌ తెలిపారు.

తుర్కయంజాల్‌: ఆదిభట్ల సర్కిల్‌ పరిధి మునగనూర్‌లోని వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం ఐదుగురు అధికారులతో కూడిన విజిలెన్స్‌ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డుల తనిఖీతో పాటు స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే రికార్డులు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement