నివాసాల మధ్య మనిషి కాలు కలకలం | - | Sakshi
Sakshi News home page

నివాసాల మధ్య మనిషి కాలు కలకలం

Nov 18 2026 11:07 AM | Updated on Nov 18 2026 11:07 AM

ఇబ్రహీంపట్నం: నివాసాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో మనిషి కాలు లభ్యమైన సంఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నంలో కలకలం రేపింది. స్థానిక ఎన్‌ఆర్‌ఐ గార్డెన్‌ వెనక భాగంలోని గాంధీనగర్‌లో ప్రాంతంలో మనిషి కాలు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది కాలును స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఈ కాలు పురుషునిదా, మహిళా అనేది ఇంకా గుర్తించలేదు. కాలు ఎండిపోయినట్లు కనిపించింది. ఈ ఘటన ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో శ్మశానవాటిక ఉండటంతో కుక్కలు తీసుకువచ్చి, ఇక్కడ పడేసి ఉంటాయా..? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఓ కుక్క మృతిచెంది ఉండటాన్ని పోలీసులు గమనించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement