ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా పింఛన్లు

Nov 17 2026 8:11 AM | Updated on Nov 17 2026 8:11 AM

● పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎంను దీవించండి ● స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మోమిన్‌పేట/ధారూరు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం మోమిన్‌పేటలో 622 మంది లబ్ధిదారులకు చేయూత పథకం ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చల్లగా ఉండాలని దీవించాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రీ బీటీ పనులకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా వర్తింప చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మోమిన్‌పేట, మేకవనంపల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు నరోత్తంరెడ్డి, శంకర్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రాజమల్లయ్య, తహసీల్దార్‌ మునీరొద్దీన్‌, ఎంఏఓ రామకృష్ణారెడ్డి, ఏపీఎం మధుకర్‌, నాయకులు సుభాష్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, వేమారెడ్డి, శ్రీనివాస్‌, శివకుమార్‌ స్వామి, మహంత్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

మహిళల పేరిటే సంక్షేమం

కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల పేరిటే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ధారూరులోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహిళలను నెత్తిన పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, బస్సులు, పెట్రోల్‌ పంపులు, ఉచిత బస్సు ప్రయాణం, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, ధారూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబాఖాన్‌, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్‌, డీఎస్పీ అంజయ్య, ఎంపీడీఓ నర్సింహులు, తహసీల్దార్‌ సాజిదాబేగం తదితరులు పాల్గొన్నారు.

హామీలు అమలు చేస్తున్నాం

అనంతగిరి: ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం వికారాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌లో లబ్ధిదారులకు చేయూత పథకం మంజూరు పత్రాల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు రావాలంటే చాలా కష్టంగా ఉండేదని కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ పెన్షన్లు అందిస్తోందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దీపక్‌ తివారి, జెడ్పీ సీఈవో సుధీర్‌, వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement