కారు ఢీకొని ఆవు మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఆవు మృతి

Nov 17 2026 8:11 AM | Updated on Nov 17 2026 8:11 AM

కారు ఢీకొని ఆవు మృతి పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేత

కందుకూరు: కారు ఢీకొని ఓ ఆవు మృతి చెందగా, మరో గేదె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని శ్రీశైలం రహదారి కొత్తూర్‌ గేట్‌ వద్ద చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తూర్‌కు చెందిన కృష్ణయ్య తన ఆవులను మేపే క్రమంలో సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం రహదారి దాటిస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ ఆవు అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదెకు కాళ్లు విరిగాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇబ్రహీంపట్నం: సీఈఆర్‌ పోర్టల్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న 33 మొబైల్‌ ఫోన్ల బాధితుల ఫిర్యాదుల మేరకు ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సీఈఐఆర్‌ పోర్టల్‌ నమోదు చేశారు. పోర్టల్‌ సహాయంతో పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి రికవరీ చేశారు. సుమారు రూ.5 లక్షల విలువైన ఫోన్లను సోమవారం బాధితులకు ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని, లేదంటే సమీప పోలీస్‌స్టేషలో సంప్రదించాలని సూచించారు.

బీరు సీసాతో వ్యక్తిపై దాడి

బషీరాబాద్‌: మండలంలోని మైల్వార్‌ గ్రామంలో బీరు సీసాతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. ఎస్‌ఐ విఠల్‌, బాధితుడు చాకలి శ్యామప్ప తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో గ్రామానికి చెందిన దూల్ల సురేష్‌ అనే వ్యక్తి శ్యామప్ప వద్దకు వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో దూషిస్తూ బీరు సీసాతో దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనలో శ్యామప్పకు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. ఆయన వెంట ఉన్న మరికొందరు కూడా గాయపడినట్లు తెలిపారు. తనను హత్యచేయడానికి కుట్రపన్ని దాడి చేసిన దూళ్ల సురేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని శ్యామప్ప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దూల్ల సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement