ఇబ్రహీంపట్నం: పాఠశాల వద్ద తప్పిపోయిన బాలుడిని కొన్ని గంటల వ్యవధిలోనే సురక్షితంగా తల్లి చెంతకు చేర్చిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ మహేందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న విరాట్ తివారి (7)ని తండ్రి సోమవారం ఉదయం పాఠశాల వద్ద దించి వెళ్లాడు. కానీ బాలుడు పాఠశాలకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు పేరెంట్స్‌కు ఫోన్ చేశారు. ఆందోళనకు గురైన తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందించారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించి బాలుడు వెళ్లిన దారిన పసిగట్టారు. బాలుడు తమ ఇంటి సమీపంలోని మరో ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. బాలుడిని తల్లికి అప్పగించారు. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


