బైక్‌ ఢీకొని విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని విద్యార్థి మృతి

Nov 17 2026 8:11 AM | Updated on Nov 17 2026 8:11 AM

షాద్‌నగర్‌రూరల్‌: బైక్‌ ఢీకొని విద్యార్థి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణంలోని పాతజాతీయ రహదారిలోగల రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌హాలు సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ కథనం ప్రకారం .. షాబాద్‌ మండలం నాగర్‌కుంట గ్రామానికి చెందిన ప్రణయ్‌ (16) పట్టణంలోని బీసీ వెల్ఫేర్‌ వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడితో కలిసి ఆదివారంరాత్రి పాతజాతీయ రహదారిలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌న్‌ హాలువైపు వెళ్లాడు. తిరిగి వసతిగృహనికి వచ్చే సమయంలో ప్రణయ్‌ ఫంక్షన్‌హాలు సమీపంలో రోడ్డును దాటుతున్నాడు. అదేసమయంలో రాజేంద్రనగర్‌కు చెందిన లోకేష్‌ బైక్‌పై వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న ప్రణయ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన లోకేష్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరొకరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement