షాబాద్: మండలంలోని కుమ్మరిగూడ సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన సేవలను గర్తించి అవార్డు అందజేసిన బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
లింగారెడ్డిగూడ సర్పంచ్‌కు..
మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సర్పంచ్ పొన్న సుధాకర్‌రెడ్డి ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఆయనకు అవార్డు అందజేశారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధి మల్లేష్, ఉపసర్పంచ్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


