● ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
● జాబ్ మేళాకు అనూహ్య స్పందన
● 400 మంది నిరుద్యోగులు ఎంపిక
ఇబ్రహీంపట్నం: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో మల్‌రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. మల్‌రెడ్డి యువశక్తి కన్వీనర్ స్నేహరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్‌రెడ్డి ప్రారంభించిన కార్యక్రమంలో 14 ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 565 మంది నిరుద్యోగులు హాజరుకాగా రాగా అందులో 400 మంది ఎంపికయ్యారు. జాబ్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌మేళా నిర్వహించినట్టు తెలిపారు. యువతీయువకులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామకపత్రాలు అందజేశారు.


