బీటెక్‌ విద్యార్థిని అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని అదృశ్యం

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

పహాడీషరీఫ్‌: బీటెక్‌ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ బి.దయాకర్‌ రెడ్డి కథనం ప్రకారం.. హర్షగూడకు చెందిన లక్ష్మణ్‌ చిన్న కుమార్తె వర్త్య కవిత (19) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఫోన్‌ రావడంతో బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఇంటి గేట్‌ వద్ద ఫోన్‌ పడిపోయి ఉండడం తల్లికి కనిపించింది. స్థానికంగా వెతికినా జాడ తెలియరాలేదు. ఇటీవల ఫోన్‌లో ఎవరితోనే మాట్లాతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement