ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్ ప్రారంభోత్సవం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ఒకవైపు ప్రారంభోత్సవాలు.. మరోవైపు శంకుస్థాపనలు.. ఇంకోవైపు సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు హెచ్‌ఆర్‌డీ నుంచి హెలీప్యాడ్‌లో బయలుదేరి నేరుగా ఇబ్రహీంపట్నం వినోబానగర్‌లోని ‘అక్టోపస్’ క్యాంపస్‌కు చేరుకున్నారు. సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ీసీపీ తరుణ్‌జోషిని కుర్చీలో కూర్చొబెట్టారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్ కీలకంగా వ్యవహరించబోతుందని తెలిపారు.
రేడియల్ రోడ్డు పరిశీలన
సాయంత్రం 5.20 గంటలకు అటు నుంచి నేరుగా హెలీప్యాడ్‌లో బయలుదేరి, రేడియల్ రోడ్డు–1 పనులను పరిశీలించారు. సాయంత్రం 6 గంటలకు మీర్‌ఖాన్‌పేటలోని యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి చేరుకున్నారు. నిర్మాణాలను పరిశీలించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం)కు శంకుస్థాపన చేశారు. అక్కడే ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ సహా ఏర్పాట్లు, రేడియల్ రోడ్డు నిర్మాణం వంటి పనులపై సమీక్షించారు. రోడ్డు పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. భారత్ ఫ్యూచర్‌సిటీకి సంబంధించిన సమగ్ర మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
ఎఫ్‌సీడీఏ వద్దే ఎన్‌ఐయూఎంకు శంకుస్థాపన
సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం రూ.200 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఎన్‌ఐయూఎం నేట్ జీరో ప్రాంగణానికి కుర్మిద్దలో శంకుస్థాపన చేయాల్సి ఉంది. రైతుల ఆందోళనలు, క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలోఎఫ్‌సీడీఏ భవనం వద్దే ఆ భవనానికి శంకుస్థాపన చేశారు. సీఎం రాక సందర్భంగా అటు ఇబ్రహీంపట్నంలోనూ, ఇటు మీర్‌ఖాన్‌పేటలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శిలాఫలకాన్ని ఆవిష్కరించి సీపీని
కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్
మేనేజ్‌మెంట్‌కు శంకుస్థాపన
రేడియల్‌రోడ్డు, యంగ్ ఇండియా
స్కిల్ వర్సిటీ పనుల పరిశీలన
గ్లోబల్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష


