ఉప్పల్: ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వరంగల్ జాతీయ రహదారిపై చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఉప్పల్ రింగ్‌రోడ్డులో నిరసన చేపట్టారు. సీపీఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ.. ఎలివేటెడ్ కారిడార్ పనులను పూర్తి చేసేందుకు గడువులు ప్రకటించడం కాదని, వాస్తవంగా ఎప్పటిలోగా పనులు పూర్తిచేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి మాట మార్చి 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. సీపీఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, వినోద్, అశోక్ పాల్గొన్నారు.
ఉప్పల్ రింగ్‌రోడ్డులో సీపీఎం నిరసన


